దేశంలోని మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతాలుగా విశాఖపట్నం, భువనేశ్వర్, కోహిమా, ఆయిజోల్, ఈటానగర్, ముంబయి, గాంగ్‌టక్‌లు నిలిచినట్లు నారి 2025 నివేదిక వెల్లడించింది.
పట్నా, జైపుర్, ఫరిదాబాద్, దిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీలు భద్రత లేని ప్రాంతాలుగా ఉన్నాయి.
మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక/సూచిక(నారి)2025 నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి.
31 నగరాల్లో 12,770 మంది మహిళలపై సర్వేచేసి నివేదికలో జాతీయ భద్రతా స్కోరును 65 శాతంగా పేర్కొంది.
దీనికి ఎగువన ఉన్న నగరాలను సురక్షితమైనవిగా, దిగువన ఉన్న వాటిని భద్రత లేనివిగా వర్గీకరించింది.