Published on Dec 23, 2024
Current Affairs
నారా దేవాంశ్‌ ప్రపంచ రికార్డు
నారా దేవాంశ్‌ ప్రపంచ రికార్డు

చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా నారా దేవాంశ్‌ (9 ఏళ్లు) ‘ఫాస్టెస్ట్‌ చెక్‌మేట్‌ సాల్వర్‌-175 పజిల్స్‌’ రికార్డును సొంతం చేసుకోవడంతోపాటు, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఇతడు ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్‌ తనయుడు. దేవాంశ్‌ సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌-లండన్‌’ అధికారికంగా ధ్రువీకరించింది.