నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక (జీఐ) ధ్రువీకరణ పత్రం దక్కింది. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో దిల్లీలో 2024, నవంబరు 25న ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
ఇందులో భాగంగా ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్ ప్రమోషన్ లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర చేనేత, జౌళి సంక్షేమశాఖ కమిషనర్ రేఖారాణి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జీఐ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.