ప్రవాస భారతీయుల అభివృద్ధి, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రవాస తెలంగాణ మహిళ అబ్బగౌని నందినికి ఖతార్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం నారీశక్తి పురస్కారం లభించింది. ఖతార్ రాజధాని దోహాలో 2026, జనవరి 9న జరిగిన ప్రవాసీ భారతీయ దినోత్సవంలో అక్కడి భారతీయ రాయబారి విపుల్ పురస్కారాన్ని అందజేశారు.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటకు చెందిన నందిని, తన భర్త శ్రీధర్‌తో 15 ఏళ్ల కిందట ఖతార్ వెళ్లారు. వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు.