Published on Jan 3, 2025
Admissions
నార్మ్‌లో పీజీడీఎం ప్రోగ్రాం
నార్మ్‌లో పీజీడీఎం ప్రోగ్రాం

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్‌) 2025-27 విద్యా సంవత్సరానికి పీజీడీఎం (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పీజీడీఎం (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్)

అర్హత: అగ్రికల్చర్‌ లేదా అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు. క్యాట్‌ 2024 / సీమ్యాట్‌ 2025 స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: క్యాట్‌/ సీమ్యాట్‌ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ, అనలిటికల్ రైటింగ్ స్కిల్ టెస్ట్, షార్ట్ ప్రెజెంటేషన్, ఎక్స్‌పీరియన్స్‌, అకడమిక్ స్కోర్, డైవర్సిటీ ఫ్యాక్టర్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.500.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28-02-2025.

Official Website:https://naarm.org.in/home/

Online Application:https://naarm.org.in/abm25/