ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్రమోదీ 2025, అక్టోబరు 7న 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2001 అక్టోబరు 7న మోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని మూడు లోక్‌సభ ఎన్నికల్లో మోదీ విజయతీరాలకు చేర్చారు. ప్రభుత్వాధినేతగా (ప్రధానిగా, ముఖ్యమంత్రిగా) ఎక్కువకాలం సేవలు అందించిన రికార్డూ మోదీ సొంతం.