Published on Sep 18, 2024
Apprenticeship
నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్‌ సెంట్రల్‌ రైల్వే ఈసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం ఖాళీలు: 1,679

వివరాలు:

డివిజన్‌/ వర్క్‌షాప్‌: ప్రయాగ్‌రాజ్ డివిజన్, ఝాన్సీ డివిజన్, ఆగ్రా డివిజన్.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మ్యాన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, టర్నర్‌, సీవోపీఏ తదితరాలు.

వయోపరిమితి: 15.10.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రి తేదీ: 15.10.2024.

Website:https://www.rrcpryj.org/

Apply online:https://actappt.rrcrail.in/index.php