Published on Jan 28, 2025
Apprenticeship
నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో  యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

గోరఖ్‌పుర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఎన్‌ఈఆర్‌ పరిధిలోని వర్క్‌షాప్‌/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 1104

వివరాలు:

ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు: మెకానికల్‌ వర్క్‌షాప్‌ గోరఖ్‌పుర్‌, సిగ్నల్‌ వర్క్‌షాప్‌ గోరఖ్‌పుర్‌, మెకానికల్‌ వర్కషాప్‌ ఇజ్జత్‌నగర్‌, డిజిల్‌ షెడ్‌ ఇజ్జత్‌నగర్‌, క్యారేజ్‌ అండ్‌ వర్గన్‌ లఖ్‌నవూ, డిజిల్‌ షెడ్‌ గోండా, క్యారేజ్‌ అండ్‌ వర్గన్‌ వారణాసి.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్‌లు: మెకానికల్ డిజిల్‌, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్‌, తదితరాలు.

వయోపరిమితి: 16.09.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.02.2025.

Website:https://ner.indianrailways.gov.in/index.jsp