మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్రలోని కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టెక్నికల్ కేడర్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 200.
వివరాలు:
1. టెక్నీషియన్ ఫిట్టర్ (ట్రైనీ)- 95
2. టెక్నీషియన్ ఎలక్ట్రిషీయన్ (ట్రైనీ)- 95
3. టెక్నీషియన్ వెల్డర్ (ట్రైనీ)- 10
కేడర్‌లు: ఎక్స్కవేషన్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యూలేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, అప్రెంటిషిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180; ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 10-05-2025.
Website:https://www.nclcil.in/
Apply online:https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/92843/Index.html