Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 18, 2026
Government Jobs
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ట్రైనీ) గ్రేడ్-సి పోస్టులు
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ట్రైనీ) గ్రేడ్-సి పోస్టులు

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్‌) మధ్యప్రదేశ్ (సింగ్రౌలి), ఉత్తరప్రదేశ్ (సోనభద్ర) జిల్లాల్లోని గనుల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 270

వివరాలు:

1. అసిస్టెంట్ ఫోర్‌మెన్ (E&T) (ట్రైనీ): 14 

2. అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) (ట్రైనీ): 108

3. అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ): 148

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో (ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్) కనీసం 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దూరవిద్యా విధానంలో చదివిన వారు అనర్హులు.

జీతభత్యాలు: ప్రాథమిక వేతనం నెలకు రూ.47,330+ ఇతర అలవెన్సులు.

వయోపరిమితి: చివరి తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష (ఇది మొత్తం 100 మార్కులకు (70 మార్కులు టెక్నికల్, 30 మార్కులు జనరల్ నాలెడ్జ్/రీజనింగ్) ఉంటుంది, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1,180; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌-సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 05.03.2026.

Website:https://www.nclcil.in/