Published on Nov 5, 2024
Current Affairs
నార్త్‌కోస్ట్‌ టైటిల్‌
నార్త్‌కోస్ట్‌ టైటిల్‌

భారత స్క్వాష్‌ క్రీడాకారిణి అనహత్‌ సింగ్‌ కోస్టా నార్త్‌ కోస్ట్‌ పీఎస్‌ఏ ఛాలెంజర్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2024, నవంబరు 3న ఆస్ట్రేలియాలోని కాఫ్స్‌ హార్బర్‌లో జరిగిన ఈ టోర్నీ తుదిపోరులో ఆమె 11-6, 11-6, 11-7తో అకారి మిదొరికవా (జపాన్‌)ను ఓడించింది. 

అంతకుముందు సెమీస్‌లో అనహత్‌ 11-5, 7-11, 11-7, 11-9తో ఏడోసీడ్‌ క్రిస్టీ వాంగ్‌ (హాంకాంగ్‌)ను ఓడించింది.