Published on Oct 16, 2024
Current Affairs
నోయల్‌ టాటా
నోయల్‌ టాటా

టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌గా నోయల్‌ టాటా (67) 2024, అక్టోబరు 11న నియమితులయ్యారు. ఈయన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా సవతి సోదరుడు. టాటా ట్రస్ట్స్‌కు టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌లో 66% వాటా ఉంది. టాటా ట్రస్ట్స్‌లోని అన్ని ట్రస్టులకు నోయల్‌ నాయకత్వం వహిస్తారు. 

టాటా గ్రూప్‌లోని అన్ని వాణిజ్య సంస్థలను టాటా సన్స్‌ నిర్వహిస్తోంది. 100 దేశాల్లో వినియోగ వస్తువులు, హోటళ్లు, వాహనాలు, విమాన రంగాల్లో 30కి పైగా సంస్థలు టాటా సన్స్‌ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఈ సంస్థల మొత్తం టర్నోవర్‌ 165 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.14 లక్షల కోట్లు).