ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్-ఈసీ) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ 2025, జనవరి 20న నియమితులయ్యారు.
హైకోర్టులో సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిని ఈసీగా నామినేట్ చేయడం సంప్రదాయంగా వస్తోంది.
ఇప్పటివరకు ఈసీగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ నరేందర్ పదోన్నతిపై ఉత్తరాఖండ్ సీజేగా వెళ్లడంతో ప్రస్తుత నియామకం జరిగింది.