Published on Mar 6, 2025
Current Affairs
న్యాయశాఖ కార్యదర్శిగా అంజు రాఠీ రాణా
న్యాయశాఖ కార్యదర్శిగా అంజు రాఠీ రాణా

భారత న్యాయ సేవల అధికారి అంజు రాఠీ రాణా 2025, మార్చి 5న న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా అమె రికార్డు సృష్టించారు. అంతకు ముందు ఈ పదవిలో ఐఏఎస్‌ అధికారి నితిన్‌ చంద్ర బాధ్యతలు నిర్వహించారు. 

దిల్లీ ప్రభుత్వంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా 18 ఏళ్లు సేవలందించిన అంజు న్యాయమంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా చేరి తాజాగా పదోన్నతి పొందారు.