Published on Apr 16, 2025
Current Affairs
న్యూయార్క్‌ నగరం
న్యూయార్క్‌ నగరం

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం అంబేడ్కర్‌ జయంతిని అధికారికంగా గుర్తించింది. 2025 ఏప్రిల్‌ 14ను డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయంలోని అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్‌ దిలీప్‌ చౌహాన్‌ వెల్లడించారు. అంబేడ్కర్‌ 134వ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14న ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రత్యేక సభలో కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అఠావలె కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.