Published on Feb 14, 2025
Current Affairs
న్యూట్రినో
న్యూట్రినో

సుదూర విశ్వం నుంచి భూమికి చేరుకున్న అత్యంత శక్తిమంతమైన ఉప పరమాణువు ‘న్యూట్రినో’ను శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.

గతంలో గుర్తించిన న్యూట్రినోలతో పోలిస్తే ఇది దాదాపు 30 రెట్ల అధిక శక్తిని కలిగి ఉందని వారు పేర్కొన్నారు.

దీని శక్తి 220 మిలియన్‌ బిలియన్‌ ఎలెక్ట్రాన్‌ వోల్ట్స్‌గా ఉన్నట్లు తెలిపారు. 

న్యూట్రినోలు పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల లానే ఉంటాయి. కాకపోతే వీటికి ధనాత్మక, రుణాత్మక ఆవేశాలు ఉండవు. తటస్థంగా ఉంటాయి.

ద్రవ్యరాశి కూడా ఉండదు. ఇతర పదార్థాలతో సంయోగం కూడా చెందవు. అందుకే న్యూట్రినోలు ఖగోళానికి ఆవల నుంచి వివిధ పదార్థాల గుండా చొచ్చుకుంటూ ఎలాంటి ఆటంకం లేకుండా సుదీర్ఘ దూరాలు ప్రయాణిస్తాయి.

అరుదుగా నీటి అణువులో పతనమవుతాయి. అలా పతనమైనప్పుడు నీలి కాంతిని వెదజల్లుతాయి.

మధ్యదరా సముద్రంలో 3.5 కిలోమీటర్ల లోతులో ఉన్న అత్యంత శక్తిమంతమైన కేఎం3ఎన్‌ఈటీ టెలిస్కోపు ఈ న్యూట్రినోను గుర్తించింది.