న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ మార్క్ గ్రేట్‌బ్యాచ్ ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. అతడు 1988 నుంచి 1996 వరకు 41 టెస్టులు, 84 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. గ్రేట్‌బ్యాచ్ గతంలో న్యూజిలాండ్ సెలక్టర్, కోచ్‌గా కూడా పని చేశాడు. లెస్లీ ముర్దోక్ స్థానంలో అతడు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్నాడు.