భారత, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) సంబంధించిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ 2025, డిసెంబరు 22న ప్రకటించారు. 2026 ప్రథమార్ధంలో సంతకాలు జరగనున్న ఈ ఎఫ్‌టీఏ కింద వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 20 బి. డాలర్ల (సుమారు రూ.1.8 లక్షల కోట్ల) పెట్టుబడులను న్యూజిలాండ్ పెట్టనుంది.
రెండు దేశాల మధ్య వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం 2024లో 2.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21,600 కోట్ల) మేర జరిగింది. ఇందులో వస్తువుల వాటా 1.3 బి.డా. (సుమారు రూ.11,700 కోట్లు). ఎఫ్‌టీఏ కుదిరాక, అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపై 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.45,000 కోట్ల)కు చేరే అవకాశం ఉంది.