ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025, మే 11న ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, ఏపీ ప్రెస్ అకాడమీ, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ సహా మొత్తం 22 కార్పొరేషన్లు, కమిషన్‌లకు ఛైర్మన్‌లను నియమించింది.
తెదేపా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీమంత్రి కేఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో, రైతులు చేపట్టిన పాదయాత్రలో రాయపాటి శైలజ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
2019-2024 మధ్య వైకాపా హయాంలో జరిగిన అరాచకాలపై ‘విధ్వంసం’ పేరిట పుస్తకం రాసిన పాత్రికేయుడు ఆలపాటి సురేశ్‌కుమార్‌కు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు.