Published on Oct 7, 2025
Current Affairs
నోబెల్‌ పురస్కారం - వైద్యరంగం
నోబెల్‌ పురస్కారం - వైద్యరంగం

మానవ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడే కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన పరిశోధక త్రయం- మేరీ ఇ బ్రంకో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్, డాక్టర్‌ షిమోన్‌ సకగుచిలను వైద్యరంగంలో 2025 ఏడాదికి నోబెల్‌ పురస్కారం దక్కింది.

నోబెల్‌ ఎంపిక కమిటీ 2025, అక్టోబరు 6న స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఈ అవార్డును ప్రకటించింది.

ప్రధానంగా ‘పరధీయ రోగనిరోధక శక్తి (పెరిఫెరల్‌ ఇమ్యూన్‌ టాలరెన్స్‌)కి సంబంధించి వీరి ఆవిష్కరణలు.. ఆటోఇమ్యూన్‌ వ్యాధులు, క్యాన్సర్లకు సరికొత్త చికిత్సలను అభివృద్ధి చేసే దిశగా బాటలు పరిచాయంటూ నోబెల్‌ కమిటీ ప్రశంసించింది.

ఈ పరిశోధక త్రయం 2025, డిసెంబరు 10న జరిగే వేడుకలో నోబెల్‌ అందుకుంటుంది.

12 లక్షల డాలర్ల నగదు బహుమతిని పంచుకుంటుంది. 

బ్రంకో (64), రామ్స్‌డెల్‌ (64) అమెరికా పౌరులు.

బ్రంకో ప్రస్తుతం సియాటిల్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సిస్టమ్స్‌ బయాలజీలో సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

రామ్స్‌డెల్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలోని సొనోమా బయోథెరపాటిక్స్‌లో శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు.

సకగుచి (74) జపాన్‌ శాస్త్రవేత్త.

ఆయన ఒసాకాలోని ఇమ్యూనాలజీ ఫ్రాంటియర్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌.