జాన్ క్లార్క్, మిషెల్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్‌లకు భౌతికశాస్త్రంలో 2025 ఏడాదికి నోబెల్ పురస్కారం దక్కింది. డిజిటల్ కమ్యూనికేషన్లు, కంప్యూటింగ్ సాంకేతికతలను ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తున్న ‘సబ్-అటామిక్ క్వాంటమ్ టన్నెలింగ్’పై తొలినాళ్లలో విశేష పరిశోధనలు చేసినందుకు వీరికి ఈ అవార్డు లభించింది. 1980ల్లో వీరు చేసిన కృషి.. క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కంప్యూటర్లు, క్వాంటమ్ సెన్సర్ల వంటి భవిష్యత్తు తరం క్వాంటమ్ టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికీ అవకాశాలు కల్పిస్తోందంటూ అవార్డు ప్రకటన సందర్భంగా నోబెల్ కమిటీ 2025, అక్టోబరు 7న తెలిపింది. క్లార్క్, డెవోరెట్, మార్టినిస్ అమెరికాలో పరిశోధనలను నిర్వహించారు