ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ (నాబార్డ్)- కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఏబీసీఓఎన్‌ఎస్) చీఫ్ టెక్నికల్ సూపర్‌వైజర్స్, జూనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్.. ప్రాజెక్ట్ బేస్డ్ కాంట్రాక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 63
వివరాలు:
జూనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్ (సివిల్): 34
జూనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్): 27
చీఫ్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ (సివిల్)- 01
చీఫ్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ (ఎలక్ట్రికల్)- 01
అర్హత: కనీసం 60శాతం మార్కులతో పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు జూనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్‌కు రూ.45,000; చీఫ్ టెక్నికల్ సూపర్‌వైజర్‌కు రూ.1,15,000.
వయోపరిమితి: జూనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్‌కు 35 ఏళ్లు; చీఫ్ టెక్నికల్ సూపర్‌వైజర్‌కు 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 26-08-2025.
Website:https://nabcons.com/career