ముంబయి బాంద్రాలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ (నాబార్డ్) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
డేటా సైంటిస్ట్/ ఏఐ ఇంజినీర్- 02
డేటా ఇంజినీర్- 01
డేటా సైంటిస్ట్-కమ్-బీఐ డెవెలపర్- 01
స్పెషలిస్ట్-డేటా మేనేజ్‌మెంట్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు తదితర నైపుణ్యాలు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: ఏడాదికి డేటా సైంటిస్ట్/ ఏఐ ఇంజినీర్ పోస్టుకు రూ.21- రూ.30లక్షలు; డేటా ఇంజినీర్‌కు రూ.18- 27లక్షలు; డేటా సైంటిస్ట్‌కు రూ.15-రూ.21లక్షలు, స్పెషలిస్ట్‌కు రూ.12-రూ.15 లక్షలు.
వయోపరిమితి: ఏడాదికి డేటా సైంటిస్ట్/ ఏఐ ఇంజినీర్, డేటా ఇంజినీర్ పోస్టులకు 25- 35ఏళ్లు; డేటా సైంటిస్ట్‌కు 23- 30ఏళ్లు, స్పెషలిస్ట్‌కు 30- 40ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్ చార్జెస్ రూ.150; ఇతరులకు రూ.850.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-06-2025.
Website:https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26