Published on Nov 11, 2025
Government Jobs
నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ‘ఏ’) ఉద్యోగాలు
నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ‘ఏ’) ఉద్యోగాలు

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవెలప్‌మెంట్‌ సంస్థ (నాబార్డ్‌) అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ‘ఏ’) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీని ద్వారా రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ (ఆర్‌డీబీఎస్‌), లీగల్ సర్వీస్, ప్రోటోకాల్ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్ విభాగాల్లో భర్తీ చేయనుంది. 

గ్రేడ్‌ ‘ఏ’ అసిస్టెంట్‌ మేనేజర్‌: 91
 
వివరాలు:

రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ (RDBS): 85

అసిస్టెంట్ మేనేజర్ లీగల్‌ (RDBS): 02

అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్): 04

విభాగాలు: జనరల్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్‌, కంప్యూటర్‌/ఐటీ, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, ప్లాంటేషన్‌ అండ్‌ హార్టీకల్చర్‌, ఫిషరీస్‌, ఫుడ్‌ ప్రొసెసింగ్‌, ల్యాండ్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ సాయిల్‌ సైన్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మీడియా స్పెషలిస్ట్‌, ఎకనామిక్స్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌.

అర్హత: ఆర్‌డీబీఎస్‌ ఏదైనా విభాగంలో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ, బీబీఏ, బీఎంఎస్‌, ఎంబీఏ/పీజీడీఎం/సీఏ/సీఎస్‌/సీఎంఏ/పీహెచ్‌డీ; లీగల్‌ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ ఎల్‌ఎల్‌ఎం; ప్రోటోకాల్‌/ సెక్యూరిటీ పోస్టులకు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగానుభవం ఉండాలి. 

బేసిక్‌ పే: రూ.44,500.

వయోపరిమితి: ఆర్‌డీబీఎస్‌/లీగల్‌ పోస్టులకు 21- 30 ఏళ్లు; ప్రోటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ పోస్టులకు 25- 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: ఫేజ్‌1, ఫేజ్‌2, ఫేజ్‌3 ఆన్‌లైన్‌ పరీక్షలు, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్‌ చార్జెస్‌ రూ.150; ఇతరులకు రూ.850.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30-11-2025.

ఫేజ్‌-1 (ప్రిలిమ్స్‌) ఆన్‌లైన్‌ పరీక్ష: 20.12.2025.

ఫేజ్‌-2 (మెయిన్స్‌) ఆన్‌లైన్‌ పరీక్ష: 25.01.2026.

Website:https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26