Published on Nov 25, 2024
Admissions
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో అకడమిక్ సెషన్ 2025-26కు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది.

వివరాలు:

నిఫ్ట్ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్‌, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్‌పుర్, కాంగ్రా, కన్నూర్, ముంబయి, న్యూదిల్లీ, పట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్, వారణాసి.

1. బ్యాచిలర్ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి

బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(బీడీఈఎస్‌): ఫ్యాషన్ డిజైన్/ లెదర్ డిజైన్/ యాక్సెసరీ డిజైన్/ టెక్స్‌టైల్ డిజైన్/ నిట్‌వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్/ ఫ్యాషన్ ఇంటీరియర్.

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్) ప్రోగ్రామ్

2. మాస్టర్స్ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి

మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (ఎండీఈఎస్‌)

మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (ఎంఎఫ్‌ఎం)

మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌)

3. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ)

అర్హతలు: యూజీ ప్రోగ్రామ్‌కు 10+ 2 పరీక్షలో ఉత్తీర్ణత; పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్‌, బీఈ, బీటెక్‌; పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: యూజీకి 24 సంవత్సరాలు మించకూడదు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు వయోపరిమితి లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

యూజీ, పీజీ ప్రోగ్రామ్:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 06-01-2025.

ఆలస్య రుసుము రూ.5000తో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 07 నుంచి 09-01-2025 వరకు.

దరఖాస్తుల సవరణకు అవకాశం: 10 నుంచి 12-01-2025 వరకు.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్‌: జనవరి మూడో వారం, 2025.

డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష తేదీ: 09-02-2025.

ఫలితాల వెల్లడి: మార్చి, 2025.

సిట్యుయేషన్ టెస్ట్/ ఇంటర్వ్యూ/ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌: ఏప్రిల్, 2025.

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ప్రారంభం: 22-11-2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 28-02-2025.

అడ్మిట్ కార్డ్‌ డౌన్‌లోడ్‌: మార్చి, 2025.

రాత పరీక్ష: ఏప్రిల్‌, 2025.

రాత పరీక్ష ఫలితాల వెల్లడి: మే, 2025.

రిసెర్చ్‌ ప్రపోజల్‌, ప్రజెంటేషన్‌, ఇంటర్వ్యూ: జూన్, 2025.

ఫలితాల ప్రకటన: జులై, 2025.

Website:https://www.nift.ac.in/admission

Apply online:https://exams.nta.ac.in/NIFT/