హరియాణా రాష్ట్రం కుండ్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్(నిఫ్టెమ్), 2025-26 అడ్మిషన్ సెషన్‌కు సంబంధించి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఈ-ఎంబీఏ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్): 100 సీట్లు.
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, జేఈఈ మెయిన్/ నీట్/ సీయూఈటీ వ్యాలీడ్ స్కోర్ ఉండాలి.
2. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్): 120 సీట్లు
విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సప్లై ఛైన్ మేనేజ్‌మెంట్.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
3. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ): 60 సీట్లు
అర్హత: ఎంబీఏకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
4. పీహెచ్‌డీ ప్రోగ్రామ్: మొత్తం సీట్లు 72.
విభాగాలు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫుడ్ బిజినెస్ మెనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవెప్‌మెంట్, ఫుడ్ ఇంజినీరింగ్, ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్‌డిసిప్లినరీ సైన్సెస్.
అర్హత: ఎంఈ/ ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
5. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్:
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్/ మ్యాట్/ సీమ్యాట్/ జీమ్యాట్ స్కోర్ లేదా నిఫ్టెమ్-కే అడ్మిషన్ టెస్ట్ స్కోర్.
ఎంపిక విధానం: బీటెక్, ఎంటెక్‌కు విద్యార్హతల ఆధారంగా, పీహెచ్‌డీ, ఎంబీఏ, ఈ-ఎంబీఏకు విద్యార్హతలు, ఎంట్రెన్స్‌టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500.
ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంబీఏ, ఈఎంబీఏ ప్రోగ్రాములకు చివరి తేదీ: 20.06.2025.
బీటెక్ ప్రోగ్రాములకు చివరి తేదీ: 30.06.2025.