నేపాల్ తాత్కాలిక ప్రధాని మంత్రిగా విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కీ (73) నియమితులయ్యారు. ప్రధానిగా ఆమెను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ 2025, సెప్టెంబరు 12న ప్రకటించారు. రాత్రి 9.30 గంటలకు ఆమె ప్రమాణం చేసి, బాధ్యతలు చేపట్టారు. మహిళలెవరూ ఇంతవరకు నేపాల్‌కు ప్రధానిగా లేరు. ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన తొలి, ఏకైక మహిళగానూ జస్టిస్ సుశీల నిలిచారు.