పంజాబ్ మొహాలీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
వివరాలు:
1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-I (నాన్-మెడికల్): 01
2. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-II (నాన్-మెడికల్): 01
3. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1కు రూ.56,000. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2కు 67,000, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌కు రూ.28,000.
వయోపరిమితి: ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులకు 35ఏళ్లు; ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2కు 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: ది రిజిస్టార్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ సెక్టార్-67, ఎస్.ఏ.ఎస్.నగర్ (మొహాలీ), పంజాబ్.
దరఖాస్తు చివరి తేదీ: 30-06-2025.
Website: https://niper.gov.in/