Published on Feb 1, 2025
Government Jobs
నైపర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
నైపర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్‌) రెగ్యూలర్‌ ప్రాతిపదికన కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

1. ప్రొఫెసర్‌: 04

2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 05

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ : 05

విభాగాలు: ఫార్మాస్యూటిక్స్‌, నేచురల్ ప్రొడక్ట్స్‌, మెడికల్‌ డివైసెస్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 40-50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ ది రిజిస్ట్రార్‌, ఎన్‌ఐపీఈఆర్‌ హైదరాబాద్‌ బాలానగర్‌, హైదరాబాద్‌’ చిరునామాకు పంపించాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 23-02-2025.

Website:http://www.niperhyd.ac.in/