కృత్రిమమేధ, డిజిటల్, హరిత రంగాలు సహా భవిష్యత్‌లో అత్యధిక డిమాండ్ కలిగిన ఉద్యోగ మార్కెట్‌కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతల్లో భారత్ రెండో ర్యాంకు సాధించింది. తొలి స్థానంలో అమెరికా నిలిచింది.
ఈ మేరకు క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 వెల్లడించింది. లండన్ కేంద్రంగా పనిచేసే క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) సంస్థ 2025, జనవరి 16న ఈ ఏడాది తన తొలి ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్‌ను విడుదల చేసింది.