Published on Sep 20, 2024
Current Affairs
నానోమెటీరియల్‌ ఆధారిత విధానం
నానోమెటీరియల్‌ ఆధారిత విధానం

భూగర్భ జలాల్లో క్రోమియం వంటి భారలోహాల ఉనికిని తగ్గించేందుకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు నానోమెటీరియల్‌ ఆధారిత పరిష్కార మార్గాన్ని ఇటీవల అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భారలోహాలను తొలగించేందుకు తొలుత భూగర్భ జలాలను బయటకు తోడి ఆ తర్వాత అయాన్ల మార్పిడి, రివర్స్‌ ఆస్మాసిస్‌ తదితర ప్రక్రియలను నిర్వహించాల్సి వస్తోంది. ఇందుకు భిన్నంగా భూగర్భంలోనే ఆ జలాల నుంచి క్రోమియం వంటి భారలోహాలను వడపోసేందుకు దోహదపడే వినూత్న మార్గాన్ని ఐఐఎస్‌సీ పరిశోధకులు కనుకున్నారు. ఈ విధానంలో ఐరన్‌ నానోపార్టికల్‌ల సహాయంతో భారలోహాల స్థిరీకరణ జరుగుతుందని వారు తెలిపారు.