నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్- ప్రైవేట్ సెక్టార్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ), గ్రేడ్/స్కేల్-1, 2లోని స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 185
వివరాలు:
1. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA): 71
2. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ)- ఆఫీసర్స్ గ్రేడ్/ స్కేల్-I: 40
3. రిస్క్ ఆఫీసర్ (గ్రేడ్/ స్కేల్-I): 03
4. చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) గ్రేడ్/ స్కేల్-II: 03
5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ఆఫీసర్ గ్రేడ్/ స్కేల్-II: 15
6. లా ఆఫీసర్ (గ్రేడ్/ స్కేల్-II): 02
7. క్రెడిట్ ఆఫీసర్ గ్రేడ్/ స్కేల్-II: 10
8. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ గ్రేడ్/ స్కేల్-II: 10
9. హెచ్ఆర్ ఆఫీసర్ గ్రేడ్/ స్కేల్-II: 04
10. మేనేజర్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) గ్రేడ్/ స్కేల్-II: 15
11. మేనేజర్- రిస్క్ (గ్రేడ్/స్కేల్-II): 02
12. మేనేజర్-చార్టర్డ్ అకౌంటెంట్ (గ్రేడ్/ స్కేల్-II): 05
13. మేనేజర్-లా (గ్రేడ్/ స్కేల్-II): 02
14. మేనేజర్- సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్/ స్కేల్-II): 03
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పే స్కేల్: నెలకు కస్టమర్ సర్వీస్ అసోసిసయేట్ పోస్టులకు రూ.24,050 - రూ.64,480; గ్రేడ్/స్కేల్-I ఆఫీసర్స్‌కు రూ.48,480 - రూ.85,920; గ్రేడ్/స్కేల్-II మేనేజర్స్ పోస్టులకు రూ.64,820 - రూ.93,960.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఈ బ్యాంక్ ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్)ని నెట్‌వర్క్ శాఖల్లో పోస్టులను భర్తీ చేయనుంది.
దరఖాస్తు రుసుము: కస్టమర్ సర్వీస్ అసోసిసయేట్ పోస్టులకు రూ.1000; స్కేల్ I & II ఆఫీసర్స్/మేనేజర్‌ల పోస్టులకు రూ.1500.
పరీక్షా కేంద్రాలు: నైనిటాల్ (ఉత్తరాఖండ్), దెహ్రాదూన్, బరేలీ, మీరట్, మొరాదాబాద్ (ఉత్తర ప్రదేశ్), లఖ్‌నవూ, జైపుర్, దిల్లీ, అంబాలా (హర్యానా), కాన్పూర్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.01.2026.
Website:https://www.nainitalbank.bank.in/english/recruitment.aspx