ఎఫ్‌ఈఐ ఎండ్యూరెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ (సీనియర్స్) టైటిల్ నెగ్గిన మొదటి భారతీయురాలుగా నిదా అంజుమ్ (22) రికార్డు సృష్టించింది. మొత్తం 40 దేశాల నుంచి 118 మంది పాల్గొన్న పోటీలో ఆమె విజేతగా నిలిచింది.
నిదా తన గుర్రమైన పెట్రాడెల్‌రేపై రైడ్ చేస్తూ 160 కి.మీ కోర్సును కేవలం 10 గంటల 23 నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకుంది.
ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలే కాదు, అతిపిన్న వయస్కురాలు కూడా నిదానే.
ఈక్వెస్ట్రియన్ క్రీడాకారిణి అయిన నిదా స్వస్థలం కేరళలోని మలప్పురం దగ్గర్లోని తిరూర్.
ఎఫ్‌ఈఐ మార్గదర్శకాల ప్రకారం ఈక్వెస్ట్రియన్ క్రీడలు నడుస్తాయి.