2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ నీతి ఆయోగ్ ‘రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక’ పేరిట ఒక నివేదికను 2025 జనవరి 24న విడుదల చేసింది.
కాగ్, ఆర్‌బీఐతో పాటు వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ద్వారా నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించింది.
ఇందులో తొలి రెండు స్థానాలను ఒడిశా, ఛత్తీస్‌గఢ్ దక్కించుకోగా, చివరి రెండుస్థానాల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్ నిలిచాయి.
2014-15 నుంచి 2021-22 మధ్య సగటున 13వ ర్యాంకులో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత 17వ ర్యాంకుకు పడిపోయింది. అందులో తెలంగాణ 43.6 మార్కులతో 8వ స్థానంలో నిలిచింది.