Published on Mar 4, 2025
Current Affairs
నీతి ఆయోగ్‌ నివేదిక
నీతి ఆయోగ్‌ నివేదిక

నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం 2025, మార్చి 3న ‘ఫ్రం బారోవర్స్‌ టు బిల్డర్స్‌: ఉమెన్స్‌ రోల్‌ ఇన్‌ ఇండియాస్‌ ఫైనాన్షియల్‌ గ్రోత్‌ స్టోరీ’ నివేదికను విడుదల చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా దక్షిణాది రాష్ట్రాలు ముందడుగు వేస్తున్నట్లు నివేదిక తెలిపింది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి వారు అత్యధికంగా రుణాలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తొలి నాలుగు స్థానాల్లో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. 

* దేశవ్యాప్తంగా 2024లో తీసుకున్న రుణాల్లో మహిళల వాటా తమిళనాడులో 44% ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 41%, తెలంగాణలో 35%, కర్ణాటక 34% ఉన్నట్లు నవేదిక పేర్కొంది. 

* రుణాలు తీసుకుంటున్న మహిళల్లో 60% మంది సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. వీరిలో 30 ఏళ్లలోపు మహిళలు 27% మంది ఉన్నారు.