‘ఆటోమోటివ్ ఇండస్ట్రీ: పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వేల్యూ చైన్స్’ పేరిట నివేదికను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెరీ 2025, ఏప్రిల్ 11న ఆవిష్కరించారు. 145 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12.47 లక్షల కోట్ల) దిశగా వాహన విడిభాగాల తయారీ వృద్ధి చెందుతోందని, 2030 కల్లా ఈ విభాగ ఎగుమతులు 20 బి. డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు చేరతాయని ఆ నివేదిక అంచనా వేసింది. ఈ వృద్ధి కారణంగా 25 లక్షల మందికి కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని.. మొత్తం మీద ఈ రంగంలో ప్రత్యక్ష ఉద్యోగాలు 30-40 లక్షలకు చేరతాయని తెలిపింది.