పారిస్ పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్-3 విభాగంలో నితేశ్ కుమార్ స్వర్ణం నెగ్గాడు. 2024, సెప్టెంబరు 2న జరిగిన ఫైనల్లో నితేశ్ 21-14, 18-21, 23-21 తేడాతో టోక్యో రజత పతక విజేత డేనియల్ బెతెల్ (గ్రేట్ బ్రిటన్)పై విజయం సాధించాడు. ఎస్‌ఎల్-3 విభాగంలో నడుము కింది భాగంలో వైకల్యం ఉన్న వాళ్లు పోటీ పడతారు.
* పారా బ్యాడ్మింటన్ టోక్యో పారాలింపిక్స్‌లోనే అరంగేట్రం చేయగా, వరుసగా రెండు ఒలింపిక్స్‌లోనూ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్-3 విభాగంలో పసిడి భారత్‌కే దకింది. టోక్యో పారాలింపిక్స్‌లో ప్రమోద్ భగత్ స్వర్ణం సాధించాడు.