బిహార్ ముఖ్యమంత్రిగా ఇటీవల పదోసారి ప్రమాణం చేసిన నీతీశ్‌కుమార్‌కు 2025, డిసెంబరు 5న లండన్‌కు చెందిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స’ గుర్తింపు లభించింది. 2000లో మొదటిసారిగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన నీతీశ్.. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల వ్యవధిలోనే వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత 2005లో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, మధ్యలో స్వల్పకాలం (2014) మినహా ఇప్పటిదాకా ఆ పదవిలో కొనసాగుతున్నారు.