కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా బిళిగిరిరంగన బెట్ట సమీపంలో నూతన పరాన్న కీటకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అశోకా ట్రస్ట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్కు చెందిన పరిశోధకులు ఏపీ రంజిత్, ప్రియదర్శిన్ ధర్మరాజన్ ఈ కీటకాన్ని గుర్తించామని తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. ఈ కీటకాలు చీమలు, చెదలను తిని బతుకుతున్నట్లు గుర్తించామని తెలిపారు. కన్నడలో ‘కణజ హుళ’గా పిలుస్తున్న ఈ కీటకాలకు త్వరలో శాస్త్రీయనామం ఇచ్చేందుకు కీటక శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నామని వారు చెప్పారు.