ఆసియా అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు నితిన్ గుప్తా, తన్ను రజతాలు గెలిచారు.
2025, ఏప్రిల్ 16న సౌదీ అరేబియాలో జరిగిన పురుషుల 5000 మీటర్ల రేస్ వాక్‌ను నితిన్ 20 నిమిషాల 21.51 సెకన్లలో ముగించి రెండో స్థానం సాధించాడు.
నింగ్‌హావో జు (20ని 21.50సె- చైనా) స్వర్ణం, షెంగ్ కిన్ (21ని 37.88సె- చైనీస్ తైపీ) కాంస్యం నెగ్గారు.
మహిళల 400 మీటర్ల పరుగును తన్ను 57.63 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది.
ఇమామిన్ సైకి (జపాన్- 57.27 సె) స్వర్ణం, డెంగ్ నాంగ్జి (చైనా-58.01 సె) కాంస్యం గెలిచారు.