ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా 2025, జనవరి 29న నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జనవరి 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో హరీష్‌కుమార్ గుప్తాకు పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌వోపీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
జమ్మూకశ్మీర్‌కు చెందిన హరీష్‌కుమార్ గుప్తా న్యాయవిద్యను అభ్యసించారు.
2013లో శాంతిభద్రతల విభాగం ఐజీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్ గుప్తా 2017 వరకూ దాదాపు నాలుగేళ్లపాటు ఆ పోస్టులో సేవలందించారు.