ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భారత ప్రధాని మోదీ 2026, ఫిబ్రవరి 26న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వాణిజ్యం, వ్యవసాయం, విద్య, ఇంధనం, సైబర్‌స్పేస్, డిజిటల్ చెల్లింపులు తదితర రంగాల్లో దిల్లీ-టెల్‌అవీవ్ మొత్తం 17 కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
సాంకేతికతల బదిలీ ఫ్రేమ్‌వర్క్ ద్వారా మిలిటరీ హార్డ్‌వేర్ సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి చేపడుతూ.. తమ మధ్య ఇప్పటికే ఉన్న సన్నిహిత రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాయి.