Published on Mar 6, 2025
Current Affairs
నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక
నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక

భారతదేశంలో 2024లో కోటీశ్వరుల సంఖ్య 6% పెరిగిందని అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక తెలిపింది.

2023లో అధిక సంపద కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) 80,686 మంది ఉంటే, 2024లో ఈ సంఖ్య 85,698కు చేరింది. 2028 నాటికి ఈ సంఖ్య 93,753కు చేరొచ్చని అంచనా వేసింది. 

అధిక సంపద కలిగిన వ్యక్తుల సంఖ్యాపరంగా భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా; అమెరికా (9,05,413 మంది), చైనా (4,71,634), జపాన్‌ (1,22,119) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 

10 మిలియన్‌ డాలర్ల (రూ.87 కోట్ల)కు మించి ఆస్తులు కలిగి ఉన్నవారిని అధిక సంపద కలిగిన వ్యక్తులు (కోటీశ్వరులు)గా నివేదిక పరిగణించింది.

ప్రపంచవ్యాప్త కోటీశ్వరుల్లో సంఖ్యాపరంగా భారత్‌ వాటా 3.7%. భారత్‌లో సంపద వృద్ధికి మరింత అవకాశం ఉందనే విషయాన్ని ఇది సూచిస్తోంది.