Published on Nov 20, 2025
Government Jobs
నిట్‌ దుర్గాపుర్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు
నిట్‌ దుర్గాపుర్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌) దుర్గాపుర్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ గ్రూప్‌-ఏ, బి, సి పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 118 

వివరాలు: 

గ్రూప్‌-ఏ పోస్టులు: మొత్తం పోస్టులు 10

1. ప్రిన్సిపల్ సైంటిఫిక్/ ప్రిన్సిపాల్ టెక్నికల్ ఆఫీసర్: 02

2. సూపరింటెండింగ్ ఇంజినీర్: 01

3. డిప్యూటీ లైబ్రేరియన్: 01

4. సీనియర్ ఎస్‌ఏఎస్‌ ఆఫీసర్: 01

5. మెడికల్ ఆఫీసర్: 01 

6. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 02

7. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01

8. సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్: 01

గ్రూప్‌-బి: మొత్తం పోస్టులు 31

1. టెక్నికల్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ ఇంజినీర్‌: 25

2. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 01

3. సూపరిటెండెంట్‌: 05

గ్రూప్‌-సి: మొత్తం ఖాళీలు 77

1. టెక్నీషియన్‌: 26

2. సీనియర్‌ అసిస్టెంట్: 07

3. సీనియర్‌ టెక్నీషియన్‌: 13

4. జూనియర్‌ అసిస్టెంట్‌: 14

5. ల్యాబ్‌ అటెండెంట్‌/ ఆఫీస్‌ అటెండెంట్‌: 17

అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ లేదా ఎంఎస్సీ/ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఏ జనలర్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 1500; గ్రూప్‌ బి, సీ పోస్టులకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్విస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2.12.2025

Website:https://nitdgp.ac.in/p/careers