Published on Oct 2, 2024
Current Affairs
నాటో కొత్త సారథిగా మార్క్‌ రుట్‌
నాటో కొత్త సారథిగా మార్క్‌ రుట్‌

ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి ‘నాటో’ ప్రధాన కార్యదర్శిగా నెదర్లాండ్స్‌ మాజీ ప్రధానమంత్రి మార్క్‌ రుట్‌ 2024, అక్టోబరు 1న పదవీ బాధ్యతలు చేపట్టారు. పదేళ్లపాటు నాటో సారథిగా వ్యవహరించిన జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది. నార్వే దేశానికి చెందిన స్టోల్టెన్‌బర్గ్‌ 2014లో నాటో ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు.