Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 16, 2026
Admissions
నీట్‌-ఎండీఎస్‌ 2026 ప్రవేశాలు
నీట్‌-ఎండీఎస్‌ 2026 ప్రవేశాలు

దేశవ్యాప్తంగా ఉన్న డెంటల్ కళాశాలల్లో మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ (ఎండీఎస్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ ఎండీఎస్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (NBEMS) నిర్వహిస్తుంది. 

వివరాలు:

ఎండీఎస్‌ స్పెషలైజేషన్‌లు: ఓరల్ & మాక్సిల్లోఫేషియల్ సర్జరీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ & ఎండోడొంటిక్స్, ఆర్థోడాంటిక్స్ & డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, ప్రోస్టోడాంటిక్స్& పీరియాడాంటాలజీ. ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ, పెడోడాంటిక్స్ & ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, ఓరల్ పాథాలజీ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్ డెంటల్‌ సర్జరీ (బీడీఎస్‌) పూర్తి చేసి ఉండాలి. అలాగే స్టేట్ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి. 12 నెలల రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. లేదా మే 31 వరకు పూర్తి అవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్‌లు ప్రారంభం: 14-03-2026.

దరఖాస్తు చివరి తేదీ: 30-03-2026.

అడ్మిట్ కార్డులు విడుదల: 29-04-2026.

పరీక్ష తేదీ: 02-05-2026

ఫలితాలుa: 02-06-2026 లోపు

Website: https://natboard.edu.in/viewnbeexam?exam=neetmds