Published on Sep 2, 2024
Admissions
నిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
నిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్

తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2024-25 కింద పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (ఫుట్‌ టైం/ పార్ట్‌ టైం): 07 సీట్లు

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్.

అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్/ నెట్ స్కోర్ సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. 

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-09-2024.

Website:https://www.nitap.ac.in/