Published on Sep 20, 2024
Government Jobs
నిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
నిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు

తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (నిట్ ఏపీ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 125

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్‌): 48 పోస్టులు

2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్‌): 20 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I: 20 పోస్టులు

4. అసోసియేట్ ప్రొఫెసర్: 30 పోస్టులు

5. ప్రొఫెసర్: 07 పోస్టులు

విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు, ప్రొఫెసర్ పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: టీచింగ్ డెమాన్‌స్ట్రేషన్/ రిసెర్చ్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 10-10-2024.

Website:https://www.nitandhra.ac.in/main/careers.php

Apply online:https://nitandhra.ac.in/FRP/