గుజరాత్‌లోని భావనగర్‌కు చెందిన జ్ఞానమంజరి ఇన్నోవేటివ్ యూనివర్సిటీ కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నీటి అడుగున పనిచేసే డ్రోన్‌కు రూపకల్పన చేశారు. జాతీయ రక్షణ అవసరాలకు, పరిశ్రమల్లోనూ దీనిని ఉపయోగించవచ్చన్నారు. యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు దీనిని ప్రదర్శించారు. రసాయన పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించినట్లు వెల్లడించారు.