ఈశాన్య నైజీరియాలో హింస ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో దాదాపు పది లక్షల మంది ఆహారం అందక ఆకలితో అలమటించే పరిస్థితి తలెత్తింది. తమకు తక్షణ ఆర్థిక సాయం అందని పక్షంలో బాధిత నైజీరియన్లకు ఆహారం, లభించని విపత్కర పరిస్థితులు ఏర్పడతాయని ఐక్యరాజ్యసమితి ఆహార కార్యక్రమ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం 3.5 కోట్ల మంది నైజీరియన్లు తీవ్ర ఆకలి ముప్పును ఎదుర్కోబోతున్నారని ఐరాస సంస్థ తెలిపింది. ఇంత పెద్ద స్థాయిలో ఆకలి తాండవించే పరిస్థితి నైజీరియాలో ఇంతకు ముందెన్నడూ తలెత్తలేదు.
ప్రమాదకర హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో నిధులు లేక ఐరాస సంస్థ తన ఆహార సహాయాన్ని వచ్చే నెల (2026 ఫ్రిబవరి) నుంచి 72 వేల మందికి పరిమితం చేయనుంది. 2025లో కష్ట కాలంలో ఈ సంస్థ 13 లక్షల మందికి ఆహారం అందించింది.